నాగ్‌కి తమ్ముడిగా చైతూ?
on Jun 18, 2021
`కింగ్` నాగార్జున, ఆయన పెద్ద తనయుడు నాగచైతన్య ఇప్పటికే `మనం` (2014), `ప్రేమమ్` (2016) చిత్రాల్లో కలిసి నటించారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన `మనం`లో చైతూకి గత జన్మ కొడుకుగా నాగ్ నటిస్తే.. `ప్రేమమ్`లో అందుకు భిన్నంగా చైతూకి తండ్రిగా అతిథి పాత్రలో అలరించారు నాగ్. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో సందడి చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. నాగార్జున కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన `సోగ్గాడే చిన్ని నాయనా` (2016)సినిమాకి సీక్వెల్ గా `బంగార్రాజు` పేరుతో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ కొనసాగింపు చిత్రంలో నాగార్జున, అఖిల్ తాతమనవళ్ళుగా నటిస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో చైతూ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడట. అంతేకాదు.. నాగ్ తమ్ముడు పాత్రలో, కథను కీలక మలుపు తిప్పే వేషంలో చైతూ దర్శనమివ్వనున్నట్లు సమాచారం. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో `బంగార్రాజు` పట్టాలెక్కనుందని టాక్.
Also Read