అభిమాన నటుడ్ని కలుసుకోలేకపోయిన హీరో.. కారణం అభిమానులే!
on Jun 18, 2021
ప్రేక్షకులకు అభిమాన నటులున్నట్లే, నటులకూ అభిమాన నటులుంటారు. ఆ విధంగా మిథున్ చక్రవర్తి అభిమాన నటుడు హాలీవుడ్ దిగ్గజం రాబర్ట్ డి నీరో. ఆయనను ఎలాగైనా నేరుగా కలుసుకోవాలన్నది మిథున్ కోరిక. చాలా కాలంగా తీరకుండా ఉన్న ఆ కోరిక ఒకసారి తీరే అవకాశం వచ్చింది. అయితే ఆ అవకాశం తృటిలో చేజారిపోయింది.. అదీ మాస్కోలోని తన అభిమానుల వల్లే. 'డిస్కో డాన్సర్' మూవీతో మిథున్ సోవియట్ రష్యాలోనూ అభిమానుల్ని సంపాదించుకోగలిగాడు.
ఒకసారి మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లాడు మిథున్. అక్కడ ఓ వీధిలో ఆయన వెళ్తుండగా, ఎదురుగా అవతలి రోడ్డులో ఆయనకు తన అభిమాన నటుడు రాబర్ట్ డి నీరో కనిపించాడు. ఆయన కూడా అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చాడు. ఆయనను చూడగానే మిథున్ హృదయం ఉప్పొంగింది. రోడ్డు దాటి, ఆ వేపు చేరుకొని తన అభిమాన నటునికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాలని ఆయన మనసు ఉవ్విళ్లూరింది.
ఇంకేం.. రోడ్డు క్రాస్ చెయ్యబోయాడో, లేదో ఆయనన్ను గుర్తించిన రష్యన్ యువతీ యువకులు మిథున్‌ను చుట్టుముట్టేశారు. ఆయనను కదలనివ్వలేదు. వారి ప్రేమాభిమానాలకు మిథున్ పొంగిపోయినా, వారిని తప్పించుకొని బయటపడేసరికి రాబర్ట్ డి నీరో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దాంతో తన ఫేవరేట్ యాక్టర్‌ను కలుసుకొనే గోల్డెన్ చాన్స్ మిస్సయినందుకు నిరాశచెందాడు మిథున్.
Also Read