సుక్కు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తాడా!
on Jan 11, 2022

జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగునాట దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్. `ఆర్య` (2004)తో మొదలైన సుక్కు దర్శకప్రస్థానం.. ప్రీవియస్ మూవీ `పుష్ప - ద రైజ్` (2021) వరకు సక్సెస్ ఫుల్ గా సాగింది. మధ్యలో ఒకట్రెండు కమర్షియల్ ఫెయిల్యూర్స్ ఉన్నా.. డైరెక్టర్ గా ఏనాడూ ఫెయిల్ కాలేదు ఈ క్రియేటివ్ జీనియస్. కాగా, `రంగస్థలం` (2018), `పుష్ప - ద రైజ్`తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుని టాప్ ఫామ్ లో ఉన్న సుకుమార్.. ఈ సంవత్సరాంతంలో `పుష్ప - ద రూల్`తో ఎంటర్టైన్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. సుక్కు కెరీర్ ని పరిశీలిస్తే గతంలో ఏ నిర్మాణ సంస్థలోనూ మూడు చిత్రాలు చేసిన సందర్భం లేదు. అలాంటిది.. `రంగస్థలం`, `పుష్ప - ద రైజ్`, `పుష్ప - ద రూల్`.. ఇలా తన మూడు వరుస సినిమాలు కూడా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ లోనే రావడం విశేషం. మరి.. `రంగస్థలం`, `పుష్ప - ద రైజ్` రూపంలో ఇప్పటికే మైత్రీ కాంబోలో రెండు ఘనవిజయాలు చూసిన సుక్కు.. `పుష్ప - ద రూల్`తో ఆ బేనర్ కి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తాడేమో చూడాలి. మరోవైపు.. మైత్రీకి కూడా తమ సంస్థలో ఒకే దర్శకుడితో మూడు సినిమాలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అన్నట్టు.. నేడు (జనవరి 11) సుకుమార్ పుట్టినరోజు. రానున్న చిత్రాలతోనూ ఈ బర్త్ డే బాయ్.. మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని ఆకాంక్షిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



