చరణ్ మామని పుసుక్కున అంత మాటన్నాడేంటి
on Apr 30, 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన కజిన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా వచ్చారు. మొదట బన్నీ ని పొగడ్తలతో ముంచెత్తిన చరణ్, ఆ తర్వాత మీడియా పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాను చిన్నప్పటినుండి సిగ్గరి అని, ఫామిలీ ఫంక్షన్స్ లో కూడా కామ్ గా ఉండేవాడినని, బన్నీ యే అందరినీ తన డాన్స్ లతో ఎంటర్టైన్ చేసేవాడని చెప్పుకొచ్చాడు. చిరంజీవి ఎప్పుడు బన్నీ ని చూసి నేర్చుకోవాలని తనని తిట్టేవాడని వివరించాడు. చిరుత రిలీజ్ కి ముందు బన్నీ ని పిలిచి వీడు మన పరువు తీయడు కదా అని అడిగాడని, దానికి బన్నీ చిరు కి ఫుల్ భరోసా ఇచ్చాడని చెప్పాడు. ఇక మామ అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ, మామ ఏది మాట్లాడినా వివాదాస్పదంగా ఉంటుందని, అయినా దాని వెనకాల ఆయన బాధ ఏంటో తనకు తెలుసని అన్నాడు. మీడియా గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీ ని టార్గెట్ చేస్తుందని, ఇది ఆపకపోతే బాగోదని హెచ్చరించాడు. అభిమానులు మీడియా వాళ్ళ మాటలు వినరని, వాళ్లకు నిజానిజాలేంటో తెలుసని వివరించాడు. ఇక, తన సినిమా రంగస్థలం లాగే నా పేరు సూర్య కూడా రికార్డులు బద్దలు కొట్టాలని ఆశించాడు. ఇండస్ట్రీ లో మంచి సానుకూల వాతావరణం నెలకొందని, గత రెండు సంవత్సరాలుగా వినూత్నమయిన సినిమాలు వస్తున్నాయని అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



