అల్లు అరవింద్ మాటల వెనక ఆంతర్యం?
on Apr 30, 2018
.jpg)
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎప్పటినుండో కొన్ని న్యూస్ చానెల్స్ ని బాయ్ కాట్ చేయాలని పట్టుబడుతున్నారు. మొన్నా మధ్య జరిగిన మీటింగుల్లో కూడా ఈ ప్రతి పాదన పెట్టాడని తెలిసింది, అయితే దీనిని కొందరు వ్యతిరేకించారు, అది వేరే విషయం అనుకోండి. కానీ, అరవింద్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా, తన పంతం నెగ్గించుకునే ప్రయత్నాలు విడవడం లేదు. నిన్న జరిగిన తన కొడుకు అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ ఈ విషయాన్నీ మరొకసారి లేవనెత్తాడు. గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలు తమని బాధించాయని... తాము ఒక కొత్త నిర్ణయానికి వచ్చామని... అవి నచ్చని కొందరు నా పేరు సూర్య పై మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉందని. కాబట్టి, ఫాన్స్ అప్రమత్తంగా ఉండాలని... అలాంటివి నమ్మొద్దని చెప్పాడు. అయితే, నిన్న ఒక నిర్ణయం తీసుకున్నామని అది త్వరలోనే వెల్లడిస్తామని, బన్నీ కి కూడా ఈ విషయం తెలియదని వివరించాడు. నా పేరు సూర్య తాను చూశానని, చాలా బాగా వచ్చిందని, సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం అని సినిమా రిజల్ట్ ఏంటో హింట్ ఇచ్చాడు. దర్శకుడు వక్కంతం వంశీ ని కూడా అల్లు అరవింద్ పొగడ్తలతో ముంచెత్తాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



