కరోనాతో బాలీవుడ్ సంగీత దర్శకుడి మృతి
on Jun 1, 2020
కరోనా రక్కసి కాటు వేయడంతో ఓ బాలీవుడ్ సంగీత దర్శకుడు మృతి చెందాడు. ఇప్పటివరకు దేశంలో పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. అదృష్టవశాత్తూ అందరూ చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే తొలిసారి, అదీ చిత్ర పరిశ్రమ నుండి ఒకరు మరణించిన ఘటన చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్ లో వాజిద్ ఇకలేరు. కరోనా మహమ్మారి ఆయన్ను బలి తీసుకుంది. కోవిడ్19 కారణంగా 42 సంవత్సరాల వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ప్రముఖ గాయకుడు సోను నిగమ్ ఈ విషాదకర సంగతి ట్వీట్ చేశారు. వాజిద్ ఖాన్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కరోనా కారణంగా మృతి చెందారని బాలీవుడ్ కన్ఫర్మ్ చేసింది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' సినిమాతో సాజిద్-వాజిద్ సంగీత దర్శకులుగా ప్రయాణం ప్రారంభించారు. ఆ సినిమాలో ఒక పాట కంపోజ్ చేశారు. తర్వాత పలు సినిమాల్లో పాటలకు సంగీతం అందించారు. సల్మాన్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'దబాంగ్'కి సాజిద్-వాజిద్ పని చేశారు.