ఈ వారం థియేటర్,ఓటిటి చిత్రాలు ఇవే..ఒక రకంగా పండుగే
on Apr 14, 2025
మండు వేసవిని మర్చిపోయేలా థియేటర్ మరియు ఓటిటి వేదికగా,సినీ ప్రియులకి ఈ వారం కావాల్సినంత సినీవినోదం అందనుంది.పైగా వేటికవే డిఫరెంట్ సబ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలతో పాటు,వివిధ భాషలకి చెందినవి కావడంతో సినీ ప్రియులకి ఒక రకంగా సినీ ఫెస్టివల్ సీజన్ అని కూడా చెప్పవచ్చు.మరి ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం.
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi)తల్లి కొడుకులుగా చేసిన మూవీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'.పక్కాయాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కగా ఈ నెల18 న వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటడానికి సిద్ధమవుతుంది.ప్రచార చిత్రాలు బాగుండటం,ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)హాజరు కావడంతో,మూవీ సరికొత్త లుక్ ని సంతరించుకుంది.సయి మంజ్రేకర్ హీరోయిన్ కాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు ఇదే రోజు తమన్నా ప్రధానపాత్రలో తెరకెక్కిన ఓదెల 2 కూడా థియేటర్స్ లో సందడి చేయనుంది.సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా(Tamanna)గ్లామర్ రోల్ కి భిన్నంగా శివశక్తీ పాత్రలో సన్యాసిగా నటిస్తుండగా సంపత్ నంది రచనలో ఈ చిత్రం తెరకెక్కింది. అశోక్ తేజ దర్శకుడు.
మాస్ మహారాజ రవితేజ(Ravi Teja)ప్రీవియస్ రొమాంటిక్ డ్రామా మూవీ'నాఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' కూడా ఈ నెల 18 న రీ రిలీజ్ కానుంది.భూమిక, గోపిక,సునీల్ ప్రధాన పాత్రల్లో కనిపించగా ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు.బాలీవుడ్ లో చూసుకుంటే 'కేసరి చాప్టర్ 2'తో అగ్ర హీరో అక్షయ్ కుమార్ 18 నే థియేటర్స్ లో అడుగుపెట్టనున్నాడు.1919 వ సంవత్సరంలో అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ లో బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని ఊచకోత కోసి చంపిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.మాధవన్,అనన్య పాండే కీలక పాత్రలు పోషించారు.
ఇక ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో చూసుకుంటే
ఏప్రిల్ 15 న సస్పెన్స్ థ్రిల్లర్ 'ది గ్లాస్ డోమ్' అనే స్వీడిష్ లాంగ్వేజ్ కి చెందిన వెబ్ సిరీస్
ఏప్రిల్ 18 ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ 'ఐహోస్టేజీ'
అమెజాన్ ప్రైమ్ లో
ఏప్రిల్ 18 'కౌఫ్' అనే హిందీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
జియో హాట్ స్టార్
ఏప్రిల్ 14 అమెరికన్ పోస్ట్ అపోకలిప్టిక్ డ్రామా'ది లాస్ట్ ఆఫ్ అజ్ 2 'వెబ్ సిరీస్
ఏప్రిల్ 16 న ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ 'ది స్టోలెన్ గర్ల్' వెబ్ సిరీస్
సోని లైవ్ లో
ఏప్రిల్ 14 'ఛమక్ ది కన్ క్లూజన్' హిందీ వెబ్ సిరీస్
ఇలా పలు విభిన్న బ్యాక్ గ్రౌండ్ తో రూపొందిన చిత్రాలు ప్రేక్షకులని అలరించనున్నాయి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
