క్రిమినల్స్ ఈ భూమ్మీద అవసరమా!నాని హిట్ 3 అరాచకం
on Apr 14, 2025
నాచురల్ స్టార్ నాని(Nani)అప్ కమింగ్ మూవీ' హిట్ 3 (Hit 3)ది థర్డ్ కేస్ అనేది ఉపశీర్షిక.'హిట్' సిరీస్ కి సీక్వెల్ గా కొనసాగుతున్న ఈ మూవీకి 'శైలేష్ కొలను'(Sailesh Kolanu) దర్శకుడు కాగా వాల్ పోస్టర్ సినిమా,యూనానిమస్ బ్యానర్స్ పై నాని,ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు.కేజిఎఫ్(Kgf)సిరీస్ ఫేమ్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty)హీరోయిన్ గా చేస్తుండగా రావురమేష్,సూర్య శ్రీనివాస్, ఆదర్శ్ బాలకృష్ణ, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
రీసెంట్ గా హిట్ 3 ట్రైలర్ రిలీజ్ అయ్యింది.సుమారు మూడు నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ లో 'క్రిమినల్స్ ఉంటే భూమ్మీద టెన్ ఫీట్స్ సెల్ లో ఉండాలి,లేదా భూమ్మీద సిక్స్ ఫీట్ హోల్ లో ఉండాలి.బిహేరియల్ కరెక్షన్ అవ్వని ఏ క్రిమినల్ కూడా సొసైటీ లో ఫ్రీ గా తిరగడానికి వీల్లేదంటూ నాని చెప్పిన డైలాగ్స్ తో సినిమా ఏ ఉదేశ్యంతో తెరకెక్కిందో అర్ధమవుతుంది.పోలీస్ ఆఫీసర్ గా నాని విశ్వరూపం ఖాయమనే విషయం కూడా ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది.మే 1 న హిట్ 3 వరల్డ్ వైడ్ గా తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
