జబర్దస్త్ vs నాగబాబు... చిన్న హీరోలకు లాభమే
on Dec 14, 2019
జబద్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చేశారు. జీ తెలుగు ఛానల్‌లో ‘అదిరింది’ అని ఒక షో స్టార్ట్ చేశారు. ఈ ఆదివారం నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ షో టెలికాస్ట్ కానుంది. దీంతో జబర్దస్త్ షో రేటింగ్ పడిందా? లేదా నాగబాబుకు ఏమైనా విపరీతమైన లాభం చేకూరిందా? అనేవి పక్కనపెడితే... చిన్న హీరోలకు మాత్రం చాలా అంటే చాలా లాభం వస్తోంది. సినిమా ప్రమోషన్లకు ఒకటికి రెండు కొత్త వేదికలు దొరికాయి.
నాగబాబు షో నుండి తప్పుకున్న తర్వాత... జబర్దస్ట్ వరకూ ఆయన ప్లేస్‌లో, ఆ సీటులో యంగ్ హీరోలను కూర్చోబెడుతోంది మల్లెమాల టీమ్. ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో అలీ జడ్జ్‌గా వస్తున్నారు. యంగ్ హీరోలకు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి జబర్దస్త్ దొరికింది. అంతకుముందు అయితే వాళ్లు రిక్వెస్ట్ చేసుకుని, జబర్దస్ట్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అయితే... జబర్దస్త్ వాళ్లే ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ‘అదిరింది’తో పాటు జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ అని మరో షో ప్రారంభమైంది. అదీ కామెడీ షోనే. కాకపోతే ఫార్మట్ వేరు. అయితే... అందులోనూ రిలీజ్‌కు రెడీగా ఉన్న కొత్త సినిమా టీమ్స్ కనపడుతున్నాయి. ఈ విధంగా యంగ్ హీరోలకు, చిన్నాచితకా హీరోలకు లాభం చేకూరుతోంది.