బయటపడిన మోహన్ లాల్ భార్య లవ్ లెటర్.. చేతన్ అనే పేరు ఎవరిది
on Nov 12, 2024
దక్షిణ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్(mohanlalనట ప్రస్థానానికి ప్రత్యేక స్థానం ఉంది.దాదాపుగా నాలుగు దశాబ్దాల నుంచి ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ అశేష అభిమానులని సంపాదించుకున్నాడు.ప్రస్తుతం మంచు విష్ణు కధానాయకుడుగా వస్తున్న 'కన్నప్ప'(kannappa)లో ఒక కీలక పాత్రని పోషించడంతో పాటుగా 'ఎంపురేన్' అనే మూవీ కూడా చేస్తున్నాడు. త్వరలోనే ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
రీసెంట్ గా మోహన్ లాల్ సతీమణి సుచిత్ర(suchitra)ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో ఆమె మాట్లాడుతు నేను చేతన్( మోహన్ లాల్ ముద్దు పేరు) ని మొదటి సారి తిరువనంతపురంలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో చూసాను. మెరున్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చిన చేతన్ ని అంతకుముందు తెరపై చూడటమే కానీ రియల్ గా చూడటం మొదటి సారి.పైగా మా రెండు కుటుంబాలకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని కూడా ఆ పెళ్ళిలో అర్ధమయ్యింది.మొదటి సినిమా మజిల్ విరుంజ పుక్కళ్ చూసినప్పుడు ఆయన మీద ప్రేమ పుట్టలేదు.కానీ ఆ తర్వాత ఆయన సినిమాలన్నీ చూడటం మొదలు పెట్టాకా ఆయనెంత ప్రతిభావంతుడో అర్ధమయ్యింది. అప్పటినుంచి ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. దాంతో చేతన్ కి నా పేరు లేకుండా ఉత్తరాలు రాయడం ప్రారంభించాను.రోజుకి ఐదు కార్డులు రాసేదాన్ని.ఆయన ఎక్కడకి వెళ్తున్నాడో తెలుసుకొని ఆ అడ్రస్ కి కూడా లెటర్స్ రాసేదాన్ని.
ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రేమతో చేతన్ ని వేధించాను.ఆయన్ని సుందర కుట్టప్పన్(అందమైన అబ్బాయి ) అనే కోడ్ భాషలో పిలిచే దాన్ని.బహుశా నేను అలా పిలుస్తానని ఇప్పటికీ ఆయనకీ తెలియదు.మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు చేతన్ గురించి చెప్పాను. దాంతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడి మా పెళ్లి చేసారని చెప్పుకొచ్చింది. 1988 లో మోహన్ లాల్, సుచిత్ర ల వివాహం జరగగా వారివురికి ఇద్దరు పిల్లలు.
Also Read