15 నిమిషాలకు 75 కోట్లు.. ఇది అల్లు అర్జున్ రేంజ్...
on Nov 12, 2024
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప-2'. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1' 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సంచలనంగా మారింది. ఇందులో కేవలం ఒక ఎపిసోడ్ కే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఓ రీజినల్ ఫిల్మ్ కి పెట్టినంత బడ్జెట్ పెట్టారట. (Pushpa 2 The Rule)
'పుష్ప 2'లో జాతర ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. మేకర్స్ సైతం జాతర ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సినిమాలో ఈ జాతర ఎపిసోడ్ 15 నుంచి 20 నిమిషాల నిడివి ఉంటుందట. అయితే ఈ 15 నిమిషాల ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారట మేకర్స్. ఇదే ఇప్పుడు షాకింగ్ గా మారింది. రూ.75 కోట్ల అంటే టైర్-2 హీరోల భారీ సినిమాల బడ్జెట్. అలాంటిది కేవలం 15 నిమిషాల కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టే సినిమాపై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమవుతోంది.
Also Read