‘టిక్ టాక్’కి బాలీవుడ్ యాక్టర్ టాటా
on Jun 1, 2020
టిబెట్ దగ్గర బోర్డర్స్‌లో ఇండియన్ ఆర్మీతో చైనా ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతుండటం, పైగా ఘర్షణపూరిత వైఖరి ప్రదర్శిస్తుండటంతో చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలని ఇండియాలో చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ప్రొడక్ట్స్ మీద మేడిన్ చైనా కనపడితే ఉపయోగించవద్దని సోషల్ మీడియాలో అవేర్‌నెస్ క్యాంప్స్ రన్ చేస్తున్నారు. చైనాకి చెందిన యాప్స్ వాడొద్దని కోరుతున్నారు. హలో, టిక్‌టాక్ తదితర యాప్స్ చైనాకి చెందినవే.
బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్’ సినిమా గుర్తుందా? శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితం స్ఫూర్తితో తీశారు. ఇటీవల ఆయన ‘బాయ్‌కాట్ చైనీస్ ప్రొడక్ట్స్’ అని పిలుపు ఇచ్చారు. దానికి బాలీవుడ్ యాక్టర్ మిళింద్ సోమన్ స్పందించారు. ఇకపై ‘టిక్ టాక్’లో తాను ఉండనని ఆయన తెలిపారు. తన మొబైల్ నుండి చైనాకు చెందిన ‘టిక్‌టాక్’ యాప్‌ను డిలీట్ చేస్తున్నట్టు మిళింద్ సోమన్ పేర్కొన్నారు. ఆయన బాటలో ఎంతమంది నడుస్తారో చూడాలి. యాంకర్ రష్మీ గౌతమ్ సైతం సోనమ్ వాంగ్‌చుక్ వీడియో షేర్ చేశారు. ఆవిడ కూడా బాయ్‌కాట్ చైనీస్ ప్రొడక్ట్స్ క్యాంపైన్‌కి సపోర్ట్ చేస్తున్నారు.