మెగాస్టార్ సెటిల్‌మెంట్..
on Sep 22, 2016

సుమారు తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఖైదీ నెంబర్.150. చిరంజీవి సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది..మెగాస్టార్ ఎలా ఉన్నారోనన్న ఎంగ్జయిటి అభిమానులను వేధిస్తోంది. దీంతో సినిమాకు సంబంధించిన సమాచారం కోసం అభిమానులు నెట్లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగాస్టార్ మూవీకి సంబంధించిన ఓ స్టిల్ కంటపడటంతో అది పెద్ద వార్తయి కూర్చొంది. ఈ స్టిల్‌లో నడుచుకుంటూ వస్తోన్న చిరుని చూసి చుట్టూ జనాలంతా లేచి నిలబడి ఉన్నారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తూ ఉంటే అక్కడేదో సెటిల్‌మెంట్ జరగబోతోందని అర్థమవుతోంది. కత్తి సినిమాలో రైతులకు సంబంధించిన లైన్ ఉండటంతో ఖైదీ నెం.150లోనూ ఆ సన్నివేశాన్ని పెట్టినట్లున్నట్లు తెలుస్తోంది. ప్రజంట్ ఆ పిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



