"మిమ్మల్ని పెళ్లాడాలని ఉంది" అన్న అభిమానికి మీనా ఇచ్చిన ఆన్సర్ అదిరింది!
on Jul 5, 2021

నటి మీనా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ల ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇటీవల అలా లైవ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మీనా ఇచ్చిన జవాబు ఆకట్టుకుంది. ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ, మలయాళం స్టార్ హీరోల సరసన నటించి, అగ్రతారల్లో ఒకరిగాన రాణించిన మీనా, వివాహానంతరం కొంతకాలం నటనకు విరామమిచ్చారు. కూతురు పుట్టి, ఆమె స్కూలుకు వెళ్తున్నప్పట్నుంచీ తిరిగి సినిమాల్లో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
నచ్చిన, కథకు కీలకమైన పాత్రలు తన వద్దకు వస్తే వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. అలా మలయాళ, తెలుగు భాషల్లో 'దృశ్యం' సినిమా ద్వారా ఆమె ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నేరుగా ఓటీటీలో రిలీజైన మలయాళం 'దృశ్యం 2'లోనూ ఆమె మెప్పించారు. అదే పేరుతో తెలుగులో రీమేక్ అయిన సినిమాలో మరోసారి వెంకటేశ్ భార్యగా నటించారు మీనా. దానికి డబ్బింగ్ చెప్పడం పూర్తయిందని ఓ పోస్ట్ ద్వారా నిన్ననే వెల్లడించారు.
'దృశ్యం' తమిళంలో కమల్ హాసన్, గౌతమి జంటగా 'పాపనాశమ్' పేరుతో రీమేక్ అయ్యి హిట్టయింది. ఇప్పుడు 'పాపనాశమ్ 2' తీద్దామనుకొనేసరికి నిజ జీవితంలో సహజీవనం చేసిన కమల్, గౌతమి విడిపోయారు. ఆ ఇద్దరూ మళ్లీ కలిసి నటించే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో గౌతమి స్థానంలో మీనాను తీసుకుంటున్నారంటూ ఆమధ్య ప్రచారంలోకి వచ్చింది. ఇన్‌స్టా లైవ్‌లో ఓ అభిమాని "మీరు 'పాపనాశమ్ 2లో కమల్‌తో నటిస్తున్నారా?" అని ప్రశ్నించాడు. దానికి మీనా "కమల్ హాసన్‌ను అడగండి." అని గడుసుగా జవాబిచ్చారు. ఆ వెంటనే అవకాశం వస్తే తాను కమల్‌తో కలిసి నటించడానికి రెడీగా ఉన్నానని చెప్పారు.
మరో అభిమాని, ఆమెను పెళ్లాడాలని ఉందని అనగా, "నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా?" అని కొంటెగా రిప్లై ఇచ్చారు.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



