కొడుకును తెరపై చూసుకున్న మోహన్ బాబు
on Apr 16, 2016
కలెక్షన్ కింగ్.. కళాప్రపూర్ణ మోహన్ బాబు ఎట్టకేలకు తన కొడుకును తెరపై చూసుకున్నాడు. రీసెంట్‌గా రిలీజైన మంచు విష్ణు ఆడో రకం..ఈడో రకం సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. దీంతో థీయేటర్ల వద్ద టిక్కెట్లు దొరకని పరిస్థితి. సామాన్యులకే టిక్కెట్లు దొరకడం లేదనుకుంటే స్వయానా హీరో విష్ణు తండ్రి మోహన్ బాబుకి కూడా టిక్కెట్లు దొరకలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. అయితే ఇవాళ హైదరాబాద్‌లోని ఐనాక్స్‌లో ఆడోరకం..ఈడోరకం మార్నింగ్ షో చూశారు. కుమారుడు మంచు విష్ణు, మనవరాళ్లతో థియేటర్ వద్దకు చేరుకున్న ఆయనకి సినిమాలో మరో హీరో రాజ్‌తరుణ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు స్వాగతం పలికారు.