డైరెక్టర్ పూరిపై డిస్ట్రిబ్యూటర్ల దాడి..!
on Apr 17, 2016
ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. సి.కళ్యాణ్ నిర్మాతగా వరుణ్ తేజ్ హీరోగా పూరి డైరెక్షన్‌లో లోఫర్ సినిమా వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి నైజాం, సీడెడ్, ఆంధ్రా హక్కులను అభిషేక్, సుధీర్, మత్యాల రాందాస్ డిస్ట్రిబ్యూటర్లుగా కొనుగోలు చేశారు. ఈ సినిమా తీవ్ర నష్టాలు కలిగించడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఈ ముగ్గురు గత కొద్దిరోజులుగా పూరిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం.34లోని పూరి కార్యాలయానికి ఈ ముగ్గురు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. దీంతో పాటు పూరిపై దాడికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి పూరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.