150 మందితో దాడి.. మంచు విష్ణుపై ఫిర్యాదు చేసిన మంచు మనోజ్!
on Apr 8, 2025
మంచు ఫ్యామిలో గొడవలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు జరిగిన ఘటన రుజువు చేస్తోంది. మంచు మనోజ్ మరోసారి మంచు విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తను ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి కార్లతోపాటు కొన్ని వస్తువుల్ని కూడా దొంగిలించారని తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై స్పందించడానికి మోహన్‌బాబు కూడా అందుబాటులో లేరు అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు మంచు మనోజ్ తెలియజేస్తూ ‘మా పాప పుట్టినరోజు సందర్భంగా మనోజ్ రాజస్థాన్ వెళ్లిన సమయంలో మా ఇంటిలోకి జొరబడి 10 ఇయర్స్ పాతదైన కారు, నా భార్య కారును టోయింగ్ చేసుకుంటూ తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేశారు. అలాగే నా ఆఫీస్‌లో ఉన్న కారును కూడా తీసుకెళ్లి విష్ణు ఆఫీస్‌లో పార్క్ చేశారు. అలాగే ఇంట్లోని చాలా వస్తువులు తీసుకెళ్లిపోయారు. నా చిన్నప్పటి వస్తువులు, మా పిల్లల వస్తువులు తీసుకెళ్లిపోయారు. బంగారం ఉన్న పెట్టెను కూడా పగలకొట్టారు. అంతేకాదు, జల్‌పల్లిలో ఉన్న ఇంటిని కూడా 30 కార్లలో విష్ణుతోపాటు దాదాపు 150 మంది వచ్చి సెక్యూరిటీ వారిని కొట్టి, వాళ్ళని కట్టేసి ఇల్లు ధ్వంసం చేశారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్. ఇది ఏప్రిల్ 1న జరిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్ళు కూడా వెంటనే స్పందించారు. మా కార్లు విష్ణు ఆఫీస్‌లో ఉన్నాయి. వాటిని రికవర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే వదిలేస్తున్నాను. దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్‌లు ఉన్నాయి. ఈ ఘటనపై న్యాయం చేస్తారని పోలీసులను కోరుతున్నాను’ అన్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
