Lenin: అఖిల్ అరాచకం.. ఇది కదా అక్కినేని ఫ్యాన్స్ కి కావాల్సింది..!
on Apr 8, 2025
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నేడు(ఏప్రిల్ 8) అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. అది కూడా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. (Akhil Akkineni)
అఖిల్ నుంచి ఒక భారీ విజయం కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో హీరోగా నటించగా, అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించింది. మిగతా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలాయి. ముఖ్యంగా గత చిత్రం 'ఏజెంట్' ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 'ఏజెంట్' తర్వాత దాదాపు రెండేళ్లుగా తన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించని అఖిల్.. ఎట్టకేలకు ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. (Lenin Title Glimpse)
అఖిల్ తన ఆరవ సినిమాని 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో చేస్తున్నాడు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే 'లెనిన్' (Lenin) టైటిల్ ను ఫిక్స్ చేశారు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. నిమిషం నిడివితో విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంది. విజువల్స్, మ్యూజిక్ అదిరిపోయాయి. "మా నాయన నాకో మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా, పేరుండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు మాత్రమే ఉంటాది." అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అఖిల్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి గ్లింప్స్ లో బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా నవీన్ కుమార్, ఎడిటర్ గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
