
తమిళ నాట ఎన్నికల్లో తన సన్నిహితుడు విజయ్(Vijay)ఘన విజయం సాధించడంతో త్రిష(Trisha)ఫుల్ జోష్ లో ఉంది. పైగా రిజల్ట్ వచ్చిన నిన్న తన పుట్టిన రోజు కూడా కావడంతో జోష్ స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు మంచు లక్ష్మి నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ కూడా తనని ఆనందంలో ముంచెత్తుతుందనేది నిజం. ఎందుకంటే ఆ ఇద్దరు సుదీర్ఘ కాలం నుంచి మంచి స్నేహితులు. ఆ డీటెయిల్స్ చూద్దాం
త్రిష బర్త్ డే పై సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి(Manchu lakshmi)స్పందిస్తు "ఎన్ని ఏళ్లు గడిచినా నీలో అందం, ఉత్సాహం తగ్గలేదు. నువ్వు ఇలాగే మరిన్ని విజయాలు అందుకోవాలి అంటూ గతంలో ఆ ఇద్దరు కలిసి దిగిన ఓల్డ్ పిక్స్ ని కూడా షేర్ చేసింది. త్రిష కూడా స్పందిస్తూ "థాంక్యూ మై డార్లింగ్ లక్ష్మి" అంటూ రిప్లై ఇవ్వడంతో ఆ ఇద్దరి ట్రాన్సక్షన్ మొత్తం వైరల్ గా మారింది.
Also read: Fauji: ఫౌజీ షూటింగ్ కి వెళ్తున్న కారు నుజ్జు నుజ్జు.. ఒకరు మృతి
మంచు లక్ష్మి కేవలం విషెస్‌తో సరిపెట్టకుండా త్రిషకి ఎంతో ఇష్టమైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు, ఒక ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్‌ని పంపినట్లు సమాచారం. త్రిష ఈ నెల 14 న సూర్య తో కలిసి 'కరుప్పు'(karuppu)తో సందడి చేయనుంది






