కరోనాతో సీనియర్ మేకప్ మెన్ గంగాధర్ మృతి
on May 18, 2021
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా బారినపడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా మహమ్మారి టాలీవుడ్ లోనూ విషాదం నింపుతోంది. ఇప్పటికే పలువురు సినీప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందగా.. తాజాగా సీనియర్ మేకప్ మేన్ గంగాధర్ కరోనా కి చికిత్స పొందుతూ మరణించారు.
గంగాధర్ దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకు మేకప్ మేన్‌గా సేవలందించారు. ఆయన టాలీవుడ్ లో పలువురు ప్రముఖ హీరోలతో పని చేశారు. తెలుగు, తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్ హీరోలకు, హీరోయిన్లకు కూడా మేకప్ మెన్ గా పనిచేశారు.
గంగాధర్ మృతిపై ఇండస్ట్రీ కి చెందిన ఎంతోమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘నా లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో గంగాధర్ చీఫ్ మేకప్ మెన్‌గా పని చేశారు. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమా నుంచి నేను నిర్మించిన అన్ని చిత్రాలకే ఆయనే మేకప్ మెన్. నాకు ఎంతో సన్నిహితుడు, ఆప్తుడు. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు. అలాగే హీరో శివాజీ, హీరో శ్రీ విష్ణు, హీరో విశ్వక్ సేన్ తో పాటు పలువురు గంగాధర్ మృతికి సంతాపం ప్రకటించారు.
Also Read