'లవ్ స్టొరీ' కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు!
on Sep 21, 2021
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లవ్ స్టొరీ'. 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'లవ్ స్టొరీ' కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేయడం విశేషం.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'లవ్ స్టొరీ' చిత్రాన్ని సెప్టెంబర్ 24న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదల కోసం సామాన్యులే కాకుండా సెలెబ్రిటీలు సైతం ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఈ సినిమాని థియేటర్లో చూడటం కోసం ఎదురుచూస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. "తెలుగులో డ్యాన్స్ ఆధారంగా తెరకెక్కే సినిమాలు చాలా అరుదు. ఈ సినిమాను థియేటర్ లో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. లవ్ స్టోరీ మూవీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్" అంటూ ట్వీట్ చేశారు.
భారీ అంచనాలతో సెప్టెంబర్ 24న థియేటర్స్ లో విడుదలవుతున్న 'లవ్ స్టొరీ' ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
Also Read