అఫిసియల్.. బాబాయ్ తో అబ్బాయి.. లుక్ అదిరింది
on Sep 22, 2021
వెంకటేష్, రానా కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాబాయ్-అబ్బాయి కాంబినేషన్ లో వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దగ్గుబాటి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు వారి ఆశ నెరవేరింది. వెంకటేష్, రానా కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
'రానా నాయుడు' అనే టైటిల్ తో రూపొందుతున్న వెబ్ సిరీస్ లో తాము కలిసి నటిస్తున్నట్లు తాజాగా వెంకటేష్, రానా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ''రానాని నా కళ్ళ ముందు ఎదగటం చూసాను. స్మాల్ బాయ్ నుండి ఫైన్ యాక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు రానా నాయుడుతో మరింత మెప్పిస్తాడు" వెంకటేష్ ట్వీట్ చేశారు. ఇక రానా స్పందిస్తూ 'మా బాబాయ్ వెంకటేష్ తో స్క్రీన్ పంచుకోవాలనుకున్న నా కల ఇన్నాళ్లకు నెరవేరింది. ఆఫ్ స్క్రీన్‌లో అయన్ను ఎంతగానో ప్రేమించే నేను.. 'రానా నాయుడు'లో ఆయనతో తలపడతాను' అంటూ ట్వీట్ చేశారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్వరలో 'రానా నాయుడు' సిరీస్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ తో నిషా అగర్వాల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నిషా.. ఈ సిరీస్ తో స్కీన్‌పై సందడి చేయనున్నట్లు సమాచారం.
Also Read