షాకింగ్.. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి!
on Jan 8, 2022

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ పెద్ద కుమారుడు, రమేష్ బాబు(56) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబుని హైదరాబాద్ లో ఏఐజీ హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతిచెందారు.
మనుషులు చేసిన దొంగలు, నీడ, పాలు నీళ్లు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన రమేష్ బాబు.. 1987 లో వచ్చిన 'సామ్రాట్' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. నిర్మతగానూ రాణించారు. అయితే కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు నేడు(శనివారం) తుది శ్వాస విడిచారు.
కాగా, కృష్ణ చిన్న కుమారుడు మహేష్ బాబు ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రార్ధిస్తున్న వేల.. మహేష్ సోదరుడు రమేష్ మరణించారన్న వార్త విషాదాన్ని నింపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



