మధురం ట్రైలర్ విడుదల చేసిన మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్
on Apr 16, 2025
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వేంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం(Madhuram).ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్(VV vinayak)విడుదల చేశారు.
అనంతరంఆయన మాట్లాడుతు'ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ 'మధురం' చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి, మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. నిన్న మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె, దర్శకులు విజయ్ కుమార్ కొండా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతు 'మధురం’ ట్రైలర్ చాలా బాగుంది. ఇందులోని టీనేజ్ లవ్ స్టోరీ చూడగానే నా ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది. 2008లో నేను ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా ‘అందమైన మనసులో’. అది పదమూడేళ్ల అమ్మాయి లవ్ స్టోరీ. ఆ టైమ్‌లో సినిమా చూసినవాళ్లంతా పదేళ్లు తర్వాత రావాల్సిన సినిమా అన్నారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే ఇప్పుడు ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రయోగాత్మక ప్రేమకథలు రూపొందించడం కత్తిమీద సాములాంటిది. కానీ ట్రైలర్ చూశాక ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యిందని అనిపించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తే బంగార్రాజు లాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వస్తారు. టీమ్ అందరికీ గుడ్ లక్’’ అని చెప్పాడు.
రఘుకుంచె మాట్లాడుతు ఈ చిత్రంలోని పాటలన్నీ మధురాతి మధురంగా ఉన్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. 90స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉదయ్ రాజ్ హీరోగా మరిన్ని పెద్ద సినిమాలు చేయాలి. తనతోపాటు టీమ్ అందరికీ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. దర్శకులు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ ‘‘ఈ టైటిల్ ఎంత మధురంగా ఉందో,సినిమా కూడా అంతే మధురంగా ఉంటుంది. తొంభైల కాలంలోని స్వచ్ఛమైన ప్రేమను ఇందులో చూపిస్తున్నారు. ప్రేక్షకులకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. పాటలన్నీ చాలా వినసొంపుగా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ బాగా పెర్ఫార్మ్ చేశారు. టీమ్ అందరికీ ఈ చిత్రం మధురమైన హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు.
హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ ‘‘మా ట్రైలర్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి ధన్యవాదాలు. ఆయన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ సినిమా పూర్తి చేయడానికి బంగార్రాజు గారు చాలా సపోర్ట్ చేశారు. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్‌పుట్ రావాలనుకున్నారు. డైరెక్టర్ రాజేష్ గారు వెరీ హార్డ్ వర్కర్. నైంటీస్ కథ కావడంతో చాలా కేర్ తీసుకుని రూపొందించారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. డీవోపీ మనోహర్ గారు చక్కని విజువల్స్ ఇచ్చారు. ఆడియెన్స్ అందరికీ మా సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ ‘‘ఈ కథను ఎంత బాగా రాసుకున్నానో, అంతే చక్కని టీమ్ కుదిరింది. హీరో ఉదయ్, హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించారు. కెమెరామేన్ మనోహర్ గారు మంచి విజువల్స్ అందించారు. వెంకీ వీణ సంగీతం అందర్నీ అలరిస్తుంది. ప్రొడ్యూసర్ బంగార్రాజు గారు చేసిన సపోర్ట్‌తో బెస్ట్ అవుట్‌పుట్ వచ్చింది. నాకు సహకరించిన టీమ్‌కు, ట్రైలర్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి థ్యాంక్స్”అని చెప్పారు.
హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతు 'ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులోని నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ కి సంబంధించిన కథలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు.
నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతు ఈ చిత్రం చాలా మధురంగా ఉంటుంది. కొత్త నిర్మాతను అయినా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. అలాగే మా ట్రైలర్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి ధన్యవాదాలని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేంద్ర కూడా తమని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు .
జెమిని సురేష్, కిట్టయ్య, బస్ స్టాప్ ఫేం కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ ఎం బాబాయ్, దివ్యశ్రీ, సమ్యురెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా కెమెరామెన్: మనోహర్ కొల్లి, మ్యూజిక్: వెంకీ వీణ, పాటలు; రాఖీ, ఎడిటర్: ఎన్టీఆర్, నిర్మాత; యం. బంగార్రాజు, కథ -మాటలు -స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాజేష్ చికిలే,
పి. ఆర్.ఓ: జికె మీడియా (గణేష్, కుమార్)

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
