ప్రాణం కంటే విలువైంది కాదుగా..యుద్ధం ముగిస్తే మంచిది
on Mar 20, 2025
మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్(Mohanlal) అప్ కమింగ్ మూవీ L 2 ఎంపురాన్(L2 empuraan)ఈ నెల 27 పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.2019 లో వచ్చి సూపర్ హిట్ ని అందుకున్న లూసిఫర్ కి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కింది.దీంతో పార్ట్ 2 పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.లూసిఫర్ ని తెరకెక్కించిన అగ్ర హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)నే ఈ చిత్రానికి కూడా దర్శకుడుగా వ్యహరించడంతో పాటు ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.
రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.రిలీజైన కొన్నిగంటల్లోనే రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుపోతుంది.మూడు నిమిషాల నలబై సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ చూస్తుంటే పార్ట్ 1 ని మించి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మూవీ లవర్స్ వ్యక్తం చేస్తున్నారు.పార్ట్ 1 లో తన తండ్రి రాజకీయ పార్టీ ని కాపాడటానికి స్టీఫెన్ అలియాస్ లూసిఫర్ వస్తాడు.కానీ ఎక్కడ్నుంచి వచ్చాడో తెలియదు.ఇప్పుడు పార్ట్ 2 లో లూసిఫర్ గత జీవితంతో పాటు ప్రస్తుత తన తండ్రి పార్టీని ఏదైనా ప్రమాదం వస్తే ఎలా కాపాడతాడనే రెండు వేరియేషన్స్ లో కథ సాగుతునట్టుగా అర్ధమవుతుంది.స్టీఫెన్ క్యారక్టర్ లో మోహన్ లాల్ మరో సారి తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.మనిషి ప్రాణం కంటే ఏది విలువైంది కాదు, ఇక యుద్ధం ముగిద్దాం వంటి డైలాగులు కూడా చాలా బాగున్నాయి.
మంజువారియర్,అభిమన్యు సింగ్ ,టోవినో థామస్,ఇంద్రజిత్ సుకుమారన్ ,ఎరిక్ లు కీలక పాత్రలు పోషిస్తుండగా పార్ట్ 1 కి కథని అందించిన మురళి గోపి(MuraliGopi)నే పార్ట్ 2 కూడా కథని అందించాడు.దీపక్ దేవ్ సంగీత దర్శకుడు కాగా లైకా ప్రొడక్షన్స్(Lyca Productions)ఆశీర్వాదం సినిమాస్, గోకులం సినిమాస్ మోహన్ లాల్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
