ఎల్ 2 ఎంపురాన్ రికార్డు కలెక్షన్స్..ఆ హీరో రికార్డు గల్లంతు
on Mar 29, 2025
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal)కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ఎల్ 2 ఎంపురాన్(L2 empuraan)ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదలైంది.మలయాళంతో పాటు తెలుగు,తమిళ,కన్నడ,హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా అన్ని ఏరియాల్లోను పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.
ఇక ఈ మూవీ కలెక్షన్స్ వివరాలని చూసుకుంటే తొలిరోజు వరల్డ్ వైడ్ గా 67.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.ఇండియా 24.50 కోట్లు గ్రాస్ వసూలు చెయ్యగా ఓవర్సీస్ లో 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.మోహన్ లాల్ కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేసాడు.ఎల్ 2 కి దర్శకత్వం వహించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆడుకాలం'వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 64 .75 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి మలయాళ చిత్ర సీమలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఇప్పుడు ఆ రికార్డుని l 2 క్రాస్ చేసినట్టయ్యింది.దీంతో ఇప్పుడు మలయాళ బిగ్గెస్ట్ ఓపెనర్ గా l2 నిలిచిందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.డే 2 కూడా తన సత్తా చాటుతు 40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందనే వార్తలు వస్తున్నాయి.దీంతో రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని,రాబోయే రోజుల్లో మలయాళ చిత్ర సీమలో హయ్యస్ట్ గ్రాసర్ గా ఉన్న మంజుమ్మేల్ బాయ్స్ రికార్డుని ఎల్ 2 క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.మంజుమ్మేల్ బాయ్స్ 240 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది.
ఇక ఎల్ 2 ని లైకా ప్రొడక్షన్స్,ఆశీర్వాద్ సినిమాస్, గోకులం మూవీస్ పై సుభాస్కరాన్ ,ఆంథోనీ పెరంబవుర్, గోకులం గోపాలన్ నిర్మించగా పృథ్వీరాజ్ సుకుమారన్,మంజువారియర్,టోవినో థామస్, అభిమన్యు సింగ్,ఆండ్రియా తివాదర్, జెరోమ్ ప్లిన్, బోరిస్ ఆలివర్, కిషోర్,ఎరిక్ ఎబోని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
