మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!
on Mar 29, 2025
.webp)
2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్'(Mad)మూవీ సాధించిన సంచలన విజయం అందరకి తెలిసిందే.ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకోగా,నిన్నఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన 'మ్యాడ్ స్క్వేర్'(Mad Square)వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 16 కోట్ల గ్రాస్ ని సాధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై మేకర్స్ అధికార ప్రకటన చెయ్యాల్సి ఉంది.మూవీకి అయితే ప్రేక్షకుల దగ్గరనుంచి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.దీంతో వీకెండ్స్ లో భారీగా కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వారు అంచనా వేస్తున్నారు.
మ్యాడ్ కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్(Kalyan Shankar)'మ్యాడ్ స్క్వేర్'కి కూడా దర్శకత్వం వహించాడు.అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగవంశీ(Naga vamsi)ఫస్ట్ పార్ట్ ని మించి సెకండ్ పార్ట్ ని నిర్మించగా నార్నేనితిన్(Narne Nithin)సంగీత్ శోభన్,రామ్ నితిన్,ప్రియాంక జవాల్కర్,విష్ణుఓయ్,మురళిధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.భీమ్స్ సిసిరోలియో(Bheems ceciroleo)సంగీతాన్నిథమన్(Thaman)బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



