థియేటర్స్‌లో రిలీజ్ అయిపోయింది.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా రెడీ!
on Sep 1, 2023
ప్రస్తుతం ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో... ఓటీటీలో రిలీజ్ కావడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకుల కంటే ఓటీటీలో చూసేవారే ఎక్కువగా ఉంటారు కాబట్టి. టాప్ హీరోల సినిమాలు రిలీజ్ కోసం ఎంత ఎదురుచూస్తారో.. ఏ ఓటీటీ సంస్థలో ఆ సినిమా రిలీజ్ అవుతుందా అని అంతే ఇంట్రెస్ట్‌గా చూస్తారు. విజయ్ దేవరకొండ, సుమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఖుషి’. ఇది ఒక క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే థియేటర్స్‌లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో పలు భాషల్లో అందర్నీ ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్‌ను దక్కించుకుంది. మరికొన్ని వారాల్లో ప్రతి ఇంటికీ ‘ఖుషి’ సినిమా చేరబోతోంది.
Also Read