
థమన్(Thaman).. ఇది కేవలం పేరు కాదు బ్రాండ్ అనే రీతిలో ఎన్నో చిత్రాలకి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ లెక్కపెట్టలేని విధంగా అభిమానులని సంపాదించుకుంటున్నాడు. ఈ రోజు వరుణ్ తేజ్ తో కలిసి 'కొరియన్ కనకరాజు' గా వచ్చాడు. రావడమే కాదు ఆర్ఆర్ తో కొరియన్ కనకరాజుకి ప్రాణంగా నిలిచాడని అభిమానులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు.
తమన్ అందించిన నేపధ్య సంగీతం అసలైన మేజర్ అసెట్‌గా నిలిచిందని సినీ విశ్లేషకులు కూడా ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు. ఈ కథలో వరుణ్ తేజ్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సాధారణ యువకుడి పాత్రలో కనిపించడంతో పాటు, కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఆవహించిన తర్వాత అతనిలో వచ్చే మార్పులని చాలా వినోదాత్మకంగా ప్రదర్శించారు. హీరోయిన్ రితికా నాయక్ ఈ సినిమాలో కియా మోటార్స్ కంపెనీ ప్రతినిధిగా నటించగా, నటుడు సత్య తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. అయితే, థియేటర్లలో సీన్స్ ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడంలో ప్రధాన భూమిక పోషించింది మాత్రం తమన్ అందించిన స్కోరే. కథలోని కామెడీ, యాక్షన్, ఎమోషన్ మరియు హారర్ ఎలిమెంట్స్‌ని ఎలివేట్ చేయడంలో తమన్ రీ-రికార్డింగ్ అద్భుతంగా పనిచేసింది.
Also read: కొరియన్ కనకరాజు హైలెట్స్ ఇవే!
గతంలో వచ్చిన 'ఓజీ' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాల స్కేల్‌లో తమన్ ఈ చిత్రానికి పవర్ ఫుల్ మ్యూజికల్ బిట్స్ ఇచ్చారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే గ్యాంగ్‌స్టర్ డ్రామా సన్నివేశాలలోనూ, కనకరాజు కొరియన్ బాటిల్ ఆత్మతో ప్రవర్తించే కీలక సీన్లలోనూ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లో థ్రిల్ అందిస్తోందని ప్రేక్షకులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. స్క్రీన్‌పై సత్య కామెడీ సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఫన్నీ బిట్స్ థియేటర్లోని ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అలాగే ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ యాక్షన్ ఘట్టాలలో తమన్ మార్క్ హై-వోల్టేజ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేసింది. విజువల్ క్వాలిటీ 100 శాతంగా ఉంటే, తమన్ మ్యూజిక్ దానికి మరింత ప్రాణం పోసి 200 శాతం ఎనర్జీ ఇచ్చిందని రివ్యూయర్లు అంచనా వేస్తున్నారు.
korean kanakaraju, Varun Tej, Merlapaka Gandhi, rithika nayak





