విలన్‌గా కాజల్..?
on Jan 19, 2017

30 ప్లస్‌లో కూడా ఎక్కడా తగ్గకుండా కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తూ దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్..చిరంజీవి 150వ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం..ఖైదీ నెం.150 సూపర్ హిట్ కావడంతో కాజల్ ఫుల్ ఖుషిలో ఉంది..ఈ నేపథ్యంలో ఆ ఆనందాన్ని అభిమానులతో ట్విట్టర్‌లో పంచుకుంది. మెగాస్టార్‌తో నటించడం తాను జీవితంలో మరచిపోలేనని తెలిపింది. మీ డ్రీమ్ రోల్ ఏంటన్న ప్రశ్న విన్న అభిమానులు షాక్ అయ్యారు. తన పదేళ్ల కెరీర్‌లో గ్లామర్ రోల్స్ మినహా పెద్దగా ప్రాధాన్యమున్న పాత్రలు చేయలేదని..తనకు నెగిటివ్ రోల్స్ చేయడమంటే చాలా ఇష్టమని..అవకాశం వస్తే తనకు విలన్‌గా చేయాలని ఉందని చెప్పింది. ఈ మాటలు ఇంకా ఏ డైరెక్టర్ చెవిన పడలేదేమో..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



