
కీర్తి సురేష్ రీసెంట్ గా నాని తో కలిసి 'ఏష నాగుల గట్టు మీద ఉగుటుయ్యాలా అని ఆడిపాడి అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి ల 'జనవరి 12 విడుదల' మూవీతో బిజీగా ఉంది. ఎల్లుండి 'అక్క' అనే హిందీ వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో వివాదాలకి దూరంగా ఉండే కీర్తి తనని కొంత మంది నటీనటులు భయపెట్టారనే సంచలన వ్యాఖ్యలు చెయ్యడం టూ డే వైరల్ న్యూస్
కీర్తి సురేష్ మాట్లాడుతు 'సినిమా షూటింగ్ సమయంలో తోటి నటుల ప్రవర్తన చూసి మొదట్లో తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకి గురయ్యేదానిని. వాళ్ళు ప్రవర్తించే తీరు చూసి తన నటనలోనే ఏదో పెద్ద లోపం ఉందేమోనని, తానే షూటింగ్లో ఏదో తప్పు చేస్తున్నానని తీవ్రంగా భయపడిపోయాను. ఎంతో మంది తోటి నటులు నన్ను ఉద్దేశించి ప్రవర్తించిన విధానం వల్ల తనలో నాలో నేను మదనపడిపోయిన క్షణాలు చాలానే ఉన్నా యి. అయితే కొన్నాళ్ల పాటు ఈ రకమైన మానసిక వేదనను అనుభవించిన తర్వాతే తప్పు తన వైపు లేదని, అసలు సమస్య తన నటనలో కాకుండా ఎదుటివారి ప్రవర్తనలోనే ఉందని కాలక్రమేణా తెలుసుకున్నట్లు కీర్తి సురేష్ స్పష్టం చేశారు. తోటి నటులకు ఉండే వ్యక్తిగత భయాలు, అభద్రతా భావం లేదా ఇన్ సెక్యూరిటీస్ కారణంగానే తమ బలహీనతలను కవర్ చేసుకోవడానికి అలా ప్రవర్తించేవారు.కావాలనే నన్ను తక్కువ చేసి మాట్లాడటం ద్వారా నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసారని చెప్పింది.
ఇది కూడా చదవండి: 2 కోట్ల బడ్జెట్ మూవీ: కేజిఎఫ్ రికార్డులు బద్దలు!

దీంతో ఆ నటులు ఎవరయ్యి ఉంటారనే ఆలోచనలో అభిమానులు,నెటిజెన్స్ బిజీగా ఉన్నారు. ఒకప్పటి మలయాళ టాప్ హీరోయిన్ మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ 2016 లో వచ్చిన నేను శైలజ తో తెలుగు ఇండస్ట్రీలో కాలుమోపింది.బాలనటిగా మలయాళ సీమలోను చేసిన అనుభవం ఉంది. ఆమె తండ్రి ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్.
[Keerthy Suresh Shocking Experience Shooting Sets, keerthy suresh speech in akka web series, Akka Web Series, Keerthy Suresh Co Stars, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]






