సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ తన పెళ్లి సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన కానుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను వివాహం చేసుకున్న కావ్య.. సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు, చాక్లెట్లు, పెళ్లి ఆహ్వాన పత్రికలను అందించినట్లు వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఉద్యోగులు గిఫ్ట్ బాక్సులను తెరిచి చూస్తుండటం కనిపిస్తోంది. వాటిలో పెళ్లి ఆహ్వాన పత్రిక, చాక్లెట్లతో పాటు బంగారు ఉంగరం కూడా ఉంది. ఓ ఉద్యోగి వీడియోలో మాట్లాడుతూ.. తమకు బంగారు నాణేలు వస్తాయని అనుకున్నామని, కానీ బాక్సులో బంగారు ఉంగరం ఉండటంతో ఆశ్చర్యపోయామని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కానుకలతో పాటు ఇచ్చిన ఆహ్వాన పత్రికలో నవంబర్ 25న విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విందు సన్ గ్రూప్ ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. అలాగే ఎంతమంది ఉద్యోగులకు ఈ కానుకలు అందించారు, ఉంగరాల బరువు ఎంత, వాటి విలువ ఎంత అనే వివరాలు కూడా అధికారికంగా వెల్లడికాలేదు.
ఇది కూడా చదవండి: ‘ఓం’ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. ధనుష్ కెరీర్‌లోనే హయ్యస్ట్.!
ఇక కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ నవంబర్ 11న గ్రీస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వంటి ప్రముఖులు హాజరైనట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ 21న చెన్నైలో ఈ జంట వివాహ రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అభిమానులకు సుపరిచితమైన కావ్య మారన్.. ఇప్పుడు తన పెళ్లి వేడుకలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఉద్యోగులకు బంగారు ఉంగరాలు అందించినట్లు వస్తున్న వార్తలు, వైరల్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
మీకు నచ్చవచ్చు:
8 బియ్యపు గింజలు, రెండు బస్తాల నూనె, 5 లీటర్ల సబ్బులు దొంగతనం.. హిలేరియస్ కామెడీ.!
టాలీవుడ్‌కి ఏమైంది.. ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా!
[KavyaMaran, KavyaMarangoldrings, AnirudhRavichander, SunGroup, AnirudhKavyaWedding]






