
సినిమాలతో ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఉన్న క్షణాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన గారాలపట్టి అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా బన్నీ పెట్టిన ఓ క్యూట్ పోస్ట్ నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది.
నవంబర్ 21న అర్హ పదో పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ తన కుమార్తెతో కలిసి ఉన్న ఓ అందమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “హ్యాపీ బర్త్‌డే టు ది జాయ్ ఆఫ్ మై లైఫ్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే.. తన జీవితంలోని ఆనందం అర్హే అని చెప్పకనే చెప్పారు. ఈ చిన్న సందేశం అభిమానులను ఆకట్టుకుంటోంది.
అర్హకు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అర్హ పుట్టినరోజును కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా జరుపుకునేందుకు అల్లు ఫ్యామిలీ శ్రీలంకకు వెళ్ళింది.
మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో ఓ ప్రాజెక్ట్ కూడా లైనప్‌లో ఉంది. కెరీర్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న బన్నీ.. కూతురి పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న ఈ చిన్న సందేశంతో మరోసారి తన ఫ్యామిలీ బాండ్‌ను చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: శ్రీలంకకు అల్లు అర్జున్ ఫ్యామిలీ.. స్పెషల్ ఏంటో తెలుసా.?
[Allu Arjun, Daughter, Allu Arha, Birthday, Allu Family]





