కాటమరాయుడుపై మరో రూమర్
on Jan 21, 2017

ఈ మధ్య పవన్‌కల్యాణ్ సినిమా కాటమరాయుడుని టార్గెట్ చేశారు గాసిప్ రాయుళ్లు. పవన్ సినిమా రీషూట్‌లో పడిందని, కొన్ని సన్నివేశాల్ని మళ్లీ కొత్తగా తెరకెక్కిస్తున్నారన్న వార్త గుప్పుమంది. అదెంత నిజమో తెలీదుగానీ... ఇప్పుడు కాటమరాయుడుపై మరో రూమర్ వచ్చి చేరింది. ఈ సినిమా సంగీతం విషయంలో పవన్ అసంతృప్తిగా ఉన్నాడని, ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌కి క్లాస్ పీకాడని తెలుస్తోంది. పవన్ సినిమా గోపాల గోపాలకు సంగీతం అందించాడు అనూప్. ఆ పాటలు, అనూప్ పనితీరు నచ్చి... కాటమరాయుడుతో మరో ఆఫర్ ఇచ్చాడు పవన్.
అయితే... అనూప్ ఇప్పటి వరకూ పాటల్ని సిద్ధం చేయలేదని తెలుస్తోంది. ఇచ్చిన ఒకట్రెండు పాటలూ పవన్‌కి నచ్చలేదని, దాంతో అనూప్ పై సీరియస్ అయ్యాడని సమాచారం. చాలా తక్కువ టైమ్‌లో కావల్సిన పాటల్ని ఇచ్చే సంగీత దర్శకుడిగా అనూప్‌కి మంచి పేరుంది. అయితే... పవన్ సినిమా అనేసరికి కాస్త శ్రద్ద పెట్టి పాటల్ని కంపోజ్ చేస్తున్నాడని, అందుకే.. లేట్ అవుతుందని, ఆలస్యమైనా.. మంచి పాటల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో అనూప్ సమయం తీసుకొన్నాడని అనూప్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. ఈ ఉగాదికి కాటమరాయుడుని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన పవన్.. పాటల విషయంలో అనూప్‌ని తొందరపెడుతున్నాడట. అందుకే... వీరిద్దరి మధ్య క్లాష్ వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



