తమిళ మార్కెట్ కావాలంటున్న మంచు విష్ణు
on Jan 21, 2017

విలక్షణ నటుడు మెహన్‌బాబు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు మంచు విష్ణు..హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి పుష్కరకాలం పూర్తి అవుతున్నప్పటికి మనోడి ఖాతాలో ఒకటి రెండు హిట్లు తప్ప మరేం లేవు. అయినా అలాగే బండి నడిపిస్తున్నాడు విష్ణు. మోహన్‌బాబు కొడుకు అన్న ట్యాగ్‌లైన్‌తో తెలుగులో ఎలాంటి ఢోకా లేనప్పటికీ తనకంటూ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ కోరుకుంటున్నాడు ఈ మంచువారబ్బాయి. తాజాగా టాలీవుడ్ హీరోలు ఇతర భాషల్లో తమ మార్కెట్‌ను విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో వీరి బాటలో మంచు విష్ణు అడుగులు వేస్తున్నాడు. విష్ణు హీరోగా రమా రీల్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ మూవీకి జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా సురభి విష్ణుతో ఆడిపాడనుంది. సో బెటర్ లక్ విష్ణు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



