కొవిడ్ నుంచి కోలుకుంటున్న కమల్ హాసన్!
on Nov 27, 2021

కొవిడ్ 19 ఇన్‌ఫెక్షన్‌కు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న లోకనాయకుడు కమల్ హాసన్ చక్కగా కోలుకుంటున్నారని హాస్పిటల్ బులెటిన్ వెల్లడించింది. నవంబర్ 22న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చికిత్స నిమిత్తం చేరారు. అక్కడి ఐసోలేటెడ్ యూనిట్‌లో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూ వస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం తన సొంత ఖాదీ బ్రాండ్ 'హౌస్ ఆఫ్ ఖద్దర్'ను ప్రారంభించే నిమిత్తం యు.ఎస్. వెళ్లారు కమల్. అక్కడ్నుంచి భారత్‌కు తిరిగివచ్చాక ఆయనకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన అదివరకు రెండు డోసుల వాక్సిన్‌ను తీసుకున్నారు. తనకు కొవిడ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని నవంబర్ 22న ట్వీట్ చేసిన కమల్, ప్రజలను జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించారు.
ఆయన రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ తమిళ్ 5 షోకు మరో సెలబ్రిటీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
కొవిడ్‌తో బాధపడుతున్న కమల్.. 'బిగ్ బాస్ 5'కు కొత్త హోస్ట్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



