రజనీకాంత్ పై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు.. అసూయ ఉందంటారా
on Jul 2, 2024

కమల్ అండ్ రజనీ.. ఈ ఇద్దరి పేర్లు వింటే చాలు తమిళ ప్రేక్షకులు ఆనందంతో పులకరించి పోతారు. ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా ప్రేక్షకులు అని కూడా చెప్పుకోవచ్చు. మూడున్నర ఏళ్ళ క్రితమే పర్ఫెక్ట్ పాన్ ఇండియా హీరోలు అనే మాటకి ఉదాహరణగా కూడా నిలిచారు. మన తెలుగు నాట అయితే ఎన్నో సినిమాలు సెంచరీలు కొట్టి రికార్డు కలెక్షన్స్ ని సాధించాయి.అదే విధంగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఇరువురి ఫ్యాన్స్ గొడవలకి దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేటికి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్లందరికీ కనువిప్పు కలిగించేలా కమల్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
కమల్ ప్రెజంట్ జులై 12 న విడుదల కాబోతున్న భారతీయుడు 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక ఆంగ్ల ఛానల్ కమల్ ముందు కొన్ని ప్రశ్నలని ఉంచింది. మీరు రజనీ కాంత్ గారు ఇండియన్ సినిమా రంగంలోనే అత్యంత పాపులర్ అయిన నటులు. ఇద్దరు కలిసి నటించి చాలా సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మీ ఇద్దర్ని ఒకే మూవీ లో చూడవచ్చా. అసలు ఆ దిశగా మీ ఆలోచనలు ఉన్నాయా అని అడిగారు. మాది కొత్త కాంబో అయితే కాదు . కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో కలిసి నటించాం. ఆ సమయంలోనే ఇక కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాడు.అంతటితో ఆగకుండా పలు ఆసక్తికర విషయాలని కూడా వెల్లడి చేసాడు.
ఇద్దరం ఎప్పుడు కూడా ఏ విషయంలోను పోటీ పడలేదు. ఒకరిపై ఒకరం విమర్శలు కూడా చేసుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి అసూయకి తావు లేదు. ఇప్పటికీ ఒకరి ఎదుగుదలని మరొకరం స్పోర్టివ్ గా తీసుకొని ముందుకు సాగుతున్నాం. ఇదే మా మధ్య ఉన్న అనుబంధానికి బలమైన నిదర్శనం. మాకు ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పటినుంచే ఇలాంటి అవగాహనతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఇక కమల్, రజనీ ఇద్దరు కూడా ప్రఖ్యాత దర్శకులు బాలచందర్ గారి శిష్యులు. నటనలో ఆ ఇద్దరకీ ఓనమాలు దిద్దించింది బాలచందర్ గారే.. ఇక కమల్ రజనీ కలిసి సుమారు 16 చిత్రాల్లో నటించారు. 1985 లో వచ్చిన గిరిఫ్తార్ చివరి చిత్రం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ మెయిన్ హీరోగా చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



