అన్నతో విభేదాలా, ఇదిగో ఎన్టీఆర్ రిప్లై
on Apr 25, 2018

అన్న కళ్యాణ్ రామ్ తో జూనియర్ ఎన్టీఆర్ కి విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అన్నతో చాలా సఖ్యతగా ఉంటున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి డుమ్మా కొట్టడం పై రక రకాల కథనాలు వచ్చాయి. కళ్యాణ్ రామ్ మాత్రం తన తమ్ముడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి బాడీ బిల్డ్ చేసే పనిలో ఉన్నాడని, ఇప్పుడు తనని పిలవడం నాకు కూడా ఇష్టం లేదని సమర్ధించుకున్నారు. ఇంతలో, ఐపీయల్ యాడ్ లో ఎన్టీఆర్ దర్శనమివ్వడం, మహేష్ బాబు భరత్ అనే నేను బహిరంగ సభకి ముఖ్య అతిధిగా విచ్చేయడం అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి అనే వార్తలకి ఊతమిచ్చాయి. అయితే, వీటన్నిటినీ అబద్దం చేస్తూ, ఈ రోజు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఓపెనింగ్ కి తండ్రి హరికృష్ణ తో పాటు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తన అన్నతో ఎంతో సఖ్యతతో మెదిలినట్టు కనిపించింది. అయితే, ఎన్టీఆర్ ఎమ్మెల్యే ఫంక్షన్ రాకపోవడానికి వేరే కారణాలున్నాయి అని, ఇద్దరి మధ్య విభేదాలు వట్టి పుకార్లని ఇద్దరికీ సన్నిహితంగా ఉండే వాళ్ళు చెబుతున్నారు. ఈ రోజు లాంచ్ అయిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా కి ప్రముఖ కెమరామెన్ KV గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



