బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసిపోయింది..?
on Sep 18, 2017

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-1 క్లైమాక్స్‌కు చేరుకుంది. 14 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 16న ప్రారంభమైన ఈ షో 60వ ఎపిసోడ్ వచ్చేసరికి కేవలం ఐదుగురు (నవదీప్, హరితేజ, ఆదర్శ్, శివబాలాజీ, అర్చన) మిగిలారు. చివరి దిశలో బిగ్‌బాస్ షోను రక్తి కట్టించేందుకు షో నిర్వాహకులు కంటెస్టెంట్స్ ఫ్యామిలీలను రంగంలోకి దించారు. షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్ హౌస్‌లోకి వచ్చి బిర్యానీని వండి ప్రేక్షకులను టీవీల ముందు నుంచి కదలకుండా చేశారు. ప్రేక్షకుల ఓటింగ్, షోలో పర్ఫామెన్స్‌ల్లో మంచి మార్కులు తెచ్చుకున్న నవదీప్, హరితేజల మధ్యే మంచి పోటీ నడిచే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
షో విషయానికి వచ్చేసరికి స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు తోటి కంటెస్టెంట్స్ ఎవరితో గొడవలు పెట్టుకోకపోవడం..కాంట్రవర్సీల గోల లేకపోవడం..ప్రతి సందర్భంలోనూ వినోదాన్ని పండించడంతో నవదీప్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక హరితేజ విషయానికి వస్తే నవదీప్ రేంజ్‌లో కాకపోయినా..తన వరకు బాగానే నడుచుకుంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. వీరిలో హరితేజ బుల్లితెర యాంకర్‌గా, సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసే నటి. మరోవైపు నవదీప్ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌లో ఉన్న నటుడు. అయితే బిగ్‌బాస్ రూల్స్ ప్రకారం న్యాయనిర్ణేతలు ప్రేక్షకులే. వారు ఇచ్చే ఓటింగ్ ప్రకారమే షో నడుస్తుందని ఎన్టీఆర్ చాలా సార్లు చెప్పారు. మరి వీరిద్దరిలో ఆడియన్స్ ఎవరికి మద్దతునిస్తారో..50 లక్షల బంపర్ ప్రైజ్‌మనీ ఎవరిని వరిస్తుందో.. విజేత ఎవరో తేలాలంటే వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



