ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పిన నేషనల్ అవార్డు గెలిచిన డైరెక్టర్
on May 5, 2017
మొదటి సినిమాకి నేషనల్ అవార్డు రావడం ఎవరికయినా గొప్ప అచీవ్మెంటే. పెళ్లి చూపులు ద్వారా ఆ ఘనత సాధించిన తరుణ్ భాస్కర్ నిజంగా అభినందనీయుడే. నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్, సాయంత్రానికి హైదరాబాద్ వచ్చాడు. వచ్చి రాగానే ఎన్టీఆర్ కి క్షమాపణలు చెబుతూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసాడు. ఆ స్టేట్మెంట్ సారాంశం ఏంటంటే, తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు చూపించారని, సరదాగా మాట్లాడింది ఫ్యాన్స్ కి ఇబ్బంది పెట్టి ఉండొచ్చని, ఇప్పటి నుండి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉంటానని, ఎన్టీఆర్ కి క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు.
తన తండ్రి కానీ పెద్ద నాన్న వాళ్ళు కానీ, సీనియర్ ఎన్టీఆర్ ఫాలోయర్స్ అని, తాను కూడా అతని సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చాడు. తనకి జూనియర్ ఎన్టీఆర్ అన్నా కూడా అంతే రెస్పెక్ట్ ఉందని అతని చివరి చిత్రం జనతా గ్యారేజ్ అంటే ప్రత్యేక అభిమానమని అన్నాడు. "నాకు 28 ఏళ్ళు, తీసింది కేవలం ఒక సినిమా. నా సినిమాలో ఎన్ని తప్పులున్నాయో నాకు తెలుసు.
నేను ఇండస్ట్రీ కి చాలా కొత్త. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను మంచి స్టేజి కి రీచ్ అయితే, ఖచ్చితంగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తా. దయచేసి నేను చేసిన తప్పుల్ని క్షమించి, నా మునుముందు సినిమాలని ఆదరిస్తానని కోరుతున్నాను. త్వరలో మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెబుతాను. కానీ, దయచేసి, మీరు అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎన్టీఆర్ గురించి తప్పుగా ఏం మాట్లాడ లేదు," అని వివరించాడు. అయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పేదేంటంటే, ఐఫా అవార్డు పెళ్లి చూపులు కి కాకుండా జనతా గ్యారేజ్ కి ఇవ్వడంతో తరుణ్ కుళ్ళుకుంటున్నాడనేది వాళ్ళ అభిప్రాయం.