కోళ్ల హేమగా పేరు మార్చుకున్న కృష్ణవేణి!
on May 5, 2017

టాలీవుడ్ సినీ నటి, `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) జాయింట్ సెక్రటరీ కోళ్ల కృష్ణ వేణి అలియాస్ హేమ అధికారికంగా పేరు మార్చుకుంటున్నట్లు తెలిపారు. కొళ్ల కృష్ణ వేణి అనబడే నేను కోళ్ల హేమ గా పేరు మార్చుకున్నాను. కావున ఇక పై నన్ను కోళ్ల హేమ గా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా .
హేమ టాలీవుడ్ ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితం. ఆమె టైమింగ్ పెర్పామెన్స్ కు ప్రత్యేకమైన అభిమానులున్నారు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించారు. స్టార్ హీరోల నుంచి ఇప్పటి యంగ్ హీరోల సినిమాల వరకూ హేమ హిస్టరీ తిరగేస్తే..ఆమె పోషించిన కీలక పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాగా ఇప్పటివరకూ ఆమె పేరు అన్ స్ర్కీన్ పై హేమగా ఉన్నా..ఆమె ఒరిజినల్ నేమ్ కోళ్ల కృష్ణ వేణి. అయితే ఇప్పుడు ఆమె కొళ్ల హేమ గా పేరు మార్చుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



