అన్నీ చెప్పాడు కాని..అసలు మ్యాటర్ చెప్పలేదు..!
on Oct 6, 2016
.jpg)
ప్రజంట్ జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు తారక్. అంతా బాగానే ఉంది కానీ తను నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నాడని కానీ..ఎవరితో కమిట్ అయ్యాడనేది కానీ ఇంతవరకు తెలియరాలేదు. ఆ మధ్య త్రివిక్రమ్‌తో తారక్ సినిమా చేయబోతున్నాడని కాదు కాదు రాజమౌళితో అని...అసలు ఇదంతా కాదు అన్నయ్య కళ్యాణ్‌రామ్‌తో మల్టీస్టారర్ అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కళ్యాణ్‌రామ్ ఇజం ఆడియోలో దొరుకుతుందని అభిమానులు ఆశించారు. అనుకున్నట్లుగానే ఇజం ఆడియో జరిగడం ..దానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకావడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఎప్పటిలాగే మైకు అందుకుని అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు కానీ తన తదుపరి సినిమా గురించి మాత్రం పెదవి విప్పలేదు. దీంతో ఆడియో లాంఛ్‌లోనైనా తమ ప్రశ్నకు సమాధానం దొరకుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



