థ్రిల్లర్ స్టోరీలో ఎన్టీఆర్..!
on Jun 2, 2016
హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మాస్, ఫ్యాక్షన్, కామెడీ, రోమాంటిక్, ఫాంటసీ ఇలా అన్ని జోనర్స్‌లో నటించిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తాను ఎప్పుడూ టచ్ చేయని ఫార్మూలానూ ట్రై చేయనున్నాడు. అదే ధ్రిల్లర్..ఇప్పటి వరకు చిన్నా చితకా హీరోలు మాత్రమే టచ్ చేసిన థ్రిల్లర్ మూవీస్‌లో ఎన్టీఆర్ యాక్ట్ చేయడమంటే అది కొత్త వార్తే. ఒకప్పుడు ఒకే మూసలో సినిమాలు చేసుకుంటూ వచ్చిన జూనియర్ ఈ మధ్య తన స్టైల్ మార్చేశాడు. మెగాఫోన్ పట్టాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్టార్ రైటర్ వక్కంతం వంశీ..ఎన్టీఆర్ కోసం థ్రిల్లర్ కథను రెడీ చేశాడు. అయితే ఈ కథలో జూనియర్ కొన్ని అభ్యంతరాలు చెప్పడంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. టెంపర్, నాన్నకు ప్రేమతో తరహాలోనే ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
