రెండో రోజు కూడా రూ. వంద కోట్లు తగ్గలేదు.. ఇది 'జవాన్' వసూళ్ళ దండయాత్ర!
on Sep 9, 2023

జవాన్.. జవాన్.. జవాన్.. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ఇలాగే 'జవాన్' జపం చేస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కోలీవుడ్ కెప్టెన్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. విడుదలైన అన్ని చోట్ల వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 126. 40 కోట్ల గ్రాస్ చూసిన జవాన్.. రెండో రోజు కూడా రూ. వంద కోట్లకు తగ్గకుండా గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. సెకండ్ డే ఈ క్రేజీ మూవీ.. రూ. 112. 75 కోట్ల గ్రాస్ ఆర్జించింది. మొత్తంగా.. రెండు రోజుల్లో జవాన్ వసూళ్ళు రూ. 239.15 కోట్ల గ్రాస్ కి చేరుకున్నాయి. శని, ఆది వారాల్లోనూ ఇదే ఊపు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఫస్ట్ వీకెండ్ లో జవాన్ భారీ మొత్తమే కొల్లగొట్టబోతున్నట్టే. మరి.. జవాన్ వసూళ్ళ దండయాత్రలో మున్ముందు ఇంకెన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి.
ఏరియాల వారిగా 'జవాన్' 2 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.15.80 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.12.75 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ. 13.65 కోట్ల గ్రాస్
కేరళ: రూ. 5.25 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 106. 90 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.84.80 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల కలెక్షన్స్ : రూ.239.15 కోట్ల గ్రాస్
హిందీ 2 రోజుల నెట్: రూ. 111. 73కోట్లు
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



