షాక్ మీద షాక్.. రద్దు మీద రద్దు.. ఆందోళనలో జానీ మాస్టర్!
on Oct 7, 2024
ఈమధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ పలు రకాల వివాదాలతో అస్తవ్యస్తంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ శ్రష్టివర్మ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు. తమిళ్ సినిమా తిరులోని ఓ పాట కోసం జానీ మాస్టర్‌కి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 8న జరిగే కార్యక్రమంలో జానీ మాస్టర్ ఈ అవార్డును అందుకోవాల్సి ఉంది. దాని కోసం బెయిల్ మంజూరు చేయాల్సింది జానీ మాస్టర్ పిటిషన్ వేశారు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్‌పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదై ఉండడం వల్ల అతనికి ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది అవార్డు కమిటీ. దీంతో జానీ మాస్టర్‌కి మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న జానీ మాస్టర్‌ను తిరిగి జైలుకు తరలించేందుకు పోలీసులు ఈ పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఓ పక్క అవార్డు రద్దయింది, మరో పక్క బెయిల్ కూడా రద్దు చేయబోతున్నారు. దీంతో జానీ మాస్టర్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read