దేవర 10 వ రోజు కలెక్షన్ ల పరిస్థితి ఇదే
on Oct 7, 2024
సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(devara)విజయ పరంపర అన్నిఏరియాల్లో కొనసాగుతూనే ఉంది. విడుదలయ్యి పది రోజులు అవుతున్నా కూడా స్ట్రాంగ్ రన్ తో ముందుకు దూసుకుపోవడమే కాకుండా దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఎవెన్యూ కూడా అయ్యి ఎన్టీఆర్ స్టామినాని మరోసారి చాటి చెప్తుంది.
ఏరియా వారీగా దేవర పదవ రోజు సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.నైజాం 1 కోటి 94 లక్షలషేర్, సీడెడ్ 1.32 ,
వైజాగ్ 0.64 ,ఈస్ట్ 0.41 ,వెస్ట్ 0.27 , కృష్ణా 0.38 ,గుంటూరు 0.44 ,నెల్లూరు 0.31 లక్షలు.ఇలా మొత్తం కలుపుకొని పదవ రోజు 5 కోట్ల 71 లక్షల షేర్ ని సాధించింది. టోటల్ గా మొత్తం పది రోజులని కలుపుకుంటే నైజాం 46.81 షేర్, సీడెడ్ 25.81 , వైజాగ్ 12.70 , ఈస్ట్ 7.85 , వెస్ట్ 6.12 , కృష్ణా 7.20 ,గుంటూరు 10.16 , నెల్లూరు 5.01 ఇలా మొత్తం పది రోజుల్లో 121 కోట్ల 66 లక్షల షేర్ ని సాధించింది.
ఇప్పుడు దసరా సెలవులు కూడా ఉండటంతో రానున్న రోజుల్లో దేవర మరింత కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంది. ఇక ఇటీవల యుఎస్ లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. తన కొడుకులిద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉందని, కాకపోతే నా వృత్తి గురించి నా పిల్లలకి తెలుసు.తండ్రిని నటుడుగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వెయ్యాలని తనయులు కోరుకోవడం సహజంగా జరుగుతుందని ఎన్టీఆర్ చెప్పాడు.
Also Read