జనతా గ్యారేజ్ ట్రైలర్‌తో స్టోరీ లీక్
on Aug 13, 2016
.jpg)
మనం చాలా ట్రైలర్లు చూశాం..చూస్తూనే ఉన్నాం. వాటిలో జనతా గ్యారేజ్ ట్రైలర్ మాత్రం భిన్నంగా కనిపించింది. సాధారణంగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలో ఉన్నప్పుడు ట్రైలర్ కట్ చేస్తేటప్పుడు చాలా ఆలోచిస్తాడు దర్శకుడు. అదిరిపోయేలా ఓ పంచ్ ... అభిమానులకు నచ్చేలా ఓ డాన్స్ మూమెంట్... కొన్ని రోజులు, కాస్త రొమాన్స్... చివర్లో మళ్లీ ఓ భారీ డైలాగ్... ఇలా ట్రైలర్‌ని ముగిస్తాడు. అయితే జనతా గ్యారేజ్ ట్రైలర్‌లో ఎక్కడా ఆ కొలతలు కనిపించలేదు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా కథేంటన్నది అర్థం అవుతుంది. కథ చెబుతూ ట్రైలర్ కట్ చేసిన అతి తక్కువ ట్రైలర్లలో ఇదీ ఒకటిగా అనిపిస్తుంది. మొక్కల్ని ప్రేమించే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడన్న సంగతి ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది.
ఎక్కడో తనలాగే ఆలోచించే వ్యక్తి ఉన్నాడు.. తను మనుషుల్ని ప్రేమిస్తుంటాడు. అతనే మోహన్ లాల్. వీళ్లిద్దరూ కలస్తే ఏమవుతుంది?? అన్నదే ఈ చిత్రం కథ. కథ చెబితే సినిమా ఎక్కడ తేలిపోతుందో అని భయపడుతున్న ఈ రోజుల్లో కొరటాల ధైర్యం చేసి తన కథేంటో చెప్పేశాడు. మంచి సినిమా చూడబోతున్నారని ఆడియన్స్‌ని ముందే ప్రిపేర్ చేయించాడు. ఈ విషయంలో ఇటు కొరటాలనూ, అటు ఎన్టీఆర్‌నీ అభినందించాల్సిందే. ఇందులో మాస్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయో... అంత మంచి కాన్సెప్ట్ కూడాఉందని అర్థమవుతుంది. ట్రైలర్ బయటకు వచ్చాక ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయనడంలో ఎలాంటి అనుమానం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



