ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్... !
on Aug 13, 2016

ప్రతీ ఆడియో ఫంక్షన్‌లోనూ తన అభిమానుల్ని ఉద్దేశించి ఓ మంచి మాట చెబుతుంటాడు ఎన్టీఆర్. `ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎంత సంతోషంగా వచ్చారో, అంతే జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండి. మీ గురించి మీ వాళ్లు ఎదురుచూస్తుంటారు` అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చి తన స్పీచ్‌ని ముగిస్తాడు. అయితే ఈసారి జనగా గ్యారేజ్‌లో అభిమానులకు చిన్నపాటి క్లాస్ తీసుకొన్నాడు ఎన్టీఆర్. తన ఫొటోలకు పాలాభిషేకాలు చేయొద్దని, తన కటౌట్ల ముందు జంతువుల్ని బలి ఇవ్వొద్దని విన్నవించుకొన్నాడు.
తాను దేవుడ్ని కాదని, మీలో ఒకడ్ని అంటూ అభిమానులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేశాడు. పాలని వృథా చేసి, జంతువుల ప్రాణం తీసుకొనే ముందు ఒక్కసారి ఆలోచించమన్నాడు. ఆ డబ్బుతో పేదవాళ్ల కడుపు నింపమని కోరుకొన్నాడు ఎన్టీఆర్. నిజంగా ఎన్టీఆర్ చెప్పింది నిజం. అభిమానాన్ని చూపించుకోవడానికి సవాలక్ష మార్గాలున్నాయి. అభిమానం పేరుతో పాలని మట్టి పాలు చేయడం కంటే. ఒకరి ఆకలి బాధ తీర్చడం చాలా గొప్పది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు... అందరి ఫ్యాన్స్ ఆలోచించాలి. ఈ విషయంలో ఆలోచనా విధానం మారాలి. మిగిలిన హీరోలూ తమ అభిమానులకు ఇలానే జ్ఞానోదయం చేస్తే బాగుంటుందేమో..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



