Home

»

Latest News

గుట్టు విప్పిన 11 ఏళ్ల బాలిక: జన నాయగన్ మూవీ చేసిన మంచి ఇదే 

Aug 8, 2026 2:57PM

 

సినిమా అనేది ఎంత పవర్ ఫుల్ సాధనమో  తెలిసిందే. అందులోను ఇళయ దళపతి విజయ్ లాంటి బడా హీరో సినిమా అయితే ఆ సినిమా చెప్పే సజిషన్ డైనమేట్ కంటే శక్తివంతంగా ఉంటుంది. ఈ మాట అక్షర సత్యమని నిరూపించే ఘటన జరిగింది.


పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని కెకె నగర్ పరిధిలో 11 సంవత్సరాల చిన్నారి తన తల్లితో కలిసి నివాసముంటోంది. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరూ కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. తల్లి స్థానిక ఇళ్లలో పనిమనిషిగా జీవనం సాగిస్తూ, కూతురిని పోషిస్తోంది. కొన్నిసార్లు పనికి వెళ్లే సమయంలో పాపను కూడా తన వెంట తీసుకెళ్లేది. ఈ క్రమంలో ఒక కామాంధుడు ఆ పాపపై కన్నేసి, ఎవరికీ చెప్పకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అప్పట్లో ఆ వయసుకి తానెంతటి దారుణానికి గురవుతోందో ఆ చిన్నారి గ్రహించలేకపోయింది.  అయితే, ఇటీవల జూలై 30వ తేదీన ఆ పాప తన తండ్రితో కలిసి‘జన నాయగన్’ చూసింది. (జన నాయకుడు) .ఆ సినిమాలో సమాజంలో జరిగే లైంగిక వేధింపులు, మహిళలు ఎదుర్కొనే అన్యాయాలు, వాటికి వ్యతిరేకంగా పోరాడటం వంటి కీలకమైన సన్నివేశాలు ఉన్నాయి. థియేటర్‌లో సినిమా చూస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఒక సీన్ రాగానే ఆ బాలిక మనసులో పాత జ్ఞాపకాలు మెదిలాయి.  సినిమాలోని ఆ సీన్ చూసిన వెంటనే ఆ పాపకు తాను గతంలో ఎదుర్కొన్న ఘోరం స్పష్టంగా అర్థమైంది. తనపై కూడా ఒక వ్యక్తి ఇలాంటి అనాగరిక, అశ్లీల చర్యలకే పాల్పడ్డాడనే చేదు నిజాన్ని గ్రహించింది. ఏ మాత్రం భయపడకుండా ఆ బాలిక సినిమా ముగిసిన వెంటనే తన తండ్రికి  గతంలో ఆ వ్యక్తి తన పట్ల ఎలా ప్రవర్తించాడో స్పష్టంగా చెప్పింది. పాప మాటలు విన్న తండ్రి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.  పాప చెప్పిన వివరాల ఆధారంగా తండ్రి  స్థానిక కెకె నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి రాతపూర్వక ఫిర్యాదు అందించాడు. 

Also read: హాస్పిటల్ పాలైన అవికా గోర్... ఇచ్చిన మాట తప్పిందా!


దీంతో పోలీసులు నిందితుడిపై బాలల పరిరక్షణ చట్టమైన అత్యంత కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చెయ్యడంతో పాటు అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కి తరలించారు. ఈ సంఘటన సినీ ప్రపంచం కేవలం వినోదానికే పరిమితం కాదని, సరైన రీతిలో సందేశాన్ని ఇస్తే సామాజిక చైతన్యానికి అద్భుతమైన సాధనంగా మారుతుందని మరోసారి నిరూపించింది. థట్ ఈజ్ సినిమా అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఒక సన్నివేశంలో స్కూల్ వయసున్న ఆడ పిల్లలతో మాట్లాడుతూ 'మిమ్మల్ని ఎక్కడెక్కడ టచ్ చేస్తే అమ్మకి చెప్పాలో అనే విషయం గురించి చెప్తాడు. సాధారణంగా చిన్నారులకు తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల తీవ్రత, వాటి స్వభావం సరిగ్గా అర్థం కాక గుట్టుగా ఉండిపోతుంటారు. కానీ,  జన నాయగన్ లోని సన్నివేశం ఆ పాప మనసులో అవగాహన జ్యోతిని వెలిగించి అన్యాయాన్ని ప్రశ్నించేలా ధైర్యాన్ని నూరిపోసింది. 

Jananayagan, Vijay, Tollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com