Home

»

Latest News

భాగ్యశ్రీ బోర్సే ముంగిట గోల్డెన్ ఆఫర్!.. అదే నిజమైతే 

Aug 8, 2026 3:49PM

 


-లెనిన్ తో తన క్రేజ్ మరింత పెంచుకున్న భాగ్యశ్రీ బోర్సే
-ఆ క్రేజీ మూవీ తలుపు తట్టిందా!
-వైరల్ మారిన భాగ్యశ్రీ తాజా అప్ డేట్ 


కాబోయే అగ్ర హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ దక్కించుకున్న భామ 'భాగ్యశ్రీ బోర్సే'. నిజానికి  ఫస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ తోనే అగ్ర హీరోయిన్  మాటలు వినిపించాయి. కానీ ఇండస్ట్రీలో హిట్ మాత్రమే కొలమానం కాబట్టి లెనిన్ తో ఆ మాట సార్ధకం చేసుకుంది. నాచురల్ స్టార్  నాని ఆఫ్టర్ ప్యారడైజ్ తర్వాత 'బ్లడీ రోమియో' చేస్తున్న విషయం తెలిసిందే. ఓజి సుజీత్‌ దర్శకుడు కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నాని సరసన భాగ్యశ్రీ బోర్సేని ఫిక్స్ చేసినట్టుగా ఫిలిం సర్కిల్స్ లో    ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సుజీత్ బృందం భాగ్యశ్రీ తో  చర్చలు జరిపారని , తన క్యారక్టర్ డిజైన్ నచ్చడంతో  భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది టాక్.  త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. భాగ్యశ్రీ ఇప్పటివరకు చేసిన  నాలుగు చిత్రాల్లో లెనిన్ మాత్రమే విజయం సాధించింది. కానీ సినిమా ఫలితంతో సంబంధం  లేకుండా అందానికి తగ్గ అభినయంతో తన సత్తా చాటుతూ భారీ అభిమాన గణాన్ని సంపాదించింది. మరి దీన్ని బట్టి భాగ్యశ్రీ వల్ల బ్లడీ రోమియో ఎంతగా లాభపడతాడో అర్ధం చేసుకోవచ్చు .అదే టైంలో నాని తో జోడి కట్టడం వల్ల  భాగ్యశ్రీ తన స్టార్ డమ్ ని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. మరి  నాని, భాగ్యశ్రీ బోర్సేల జోడీ వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

 

also read: గుట్టు విప్పిన 11 ఏళ్ళ బాలిక...జన నాయగన్ మూవీ చేసిన మంచి  ఇదే 
 

నాని తో పాటు నీహారిక  ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోయే అక్టోబర్ నెల నుంచి షూట్ కి వెళ్తున్నట్టుగా సమాచారం.. ఆల్రెడీ టైటిల్ గ్లింప్స్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Bhagyashri Borse, Nani, Bloody Romeo

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com